E-PAPER

నాడు నక్సలైట్.. నేడు మంత్రి.. అన్న కేబినెట్ లో చెల్లికి చోటు..

నక్సలిజం నుంచి ప్రజాజీవితంలోకి వచ్చిన సీతక్క.. ఆ తర్వాత రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీతక్క చోటు దక్కించుకున్నారు. సీతక్కకు ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. టీడీపీలో ఉన్న సమయంలోనే ఇద్దరూ ఎంతో సమన్వయంతో పనిచేశారు. రేవంత్.. తన సొంత సోదరిలా సీతక్కను చూస్తారు. సీతక్క.. రాఖీ పండుగ రోజు రేవంత్ ఇంటి వచ్చి ఆయనకు రాఖీ కడుతుంటారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యారు. ఆయన కేబినెట్ సీతక్కకు అవకాశం కల్పించారు.

 

సీతక్క ప్రొఫైల్..

2004లో టీడీపీలో చేరిక

మూడోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క

2009 ఎన్నికల్లో తొలిసారి ములుగు ఎమ్మెల్యేగా ఎన్నిక

2018 ఎన్నికల్లో రెండోసారి ములుగు ఎమ్మెల్యేగా గెలుపు

2023 ఎన్నికల్లో మూడోసారి ములుగు ఎమ్మెల్యేగా విజయం

 

2017లో కాంగ్రెస్‌లో చేరిక

జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల నిర్వహణ

2022లో టీ-కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా నియామకం

Facebook
WhatsApp
Twitter
Telegram