E-PAPER

ఏటీఎఫ్‌ ధర 5 శాతం తగ్గింపు..

ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్‌ సంస్థలు తాజాగా సవరించిన ధరలను శుక్రవారం ప్రకటించాయి. దేశీయ విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధర 4.6 శాతం తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో ఏటీఎఫ్‌ రేటు కిలోలీటరుకు రూ.5,189 తగ్గి రూ.1,06,156కి దిగి వచ్చింది. మరోవైపు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌ (19 కేజీల) ధర రూ.21 తగ్గి రూ.1,749కి చేరుకుంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్‌ ధర రూ.903 (14.2 కేజీల సిలిండర్‌)గానే కొనసాగనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram