దేశవ్యాప్తంగా 70 లక్షల మొబైల్ నంబర్లను సస్పెండ్ చేశారు. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు గానూ అనుమానాస్పదంగా ఉన్న నంబర్లను సస్పెండ్ చేసినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) మోసాలకు సంబంధించి, సమస్యను పరిశీలించి, డేటా రక్షణను నిర్ధారించాలని రాష్ట్రాలను కోరినట్లు ఆయన చెప్పారు.