భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం ఎన్నికలను నిర్వహించాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరింది. ఎన్నికల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విఫలమైందని వ్యాఖ్యానించింది.