నటుడు మన్సూర్ అలీ ఖాన్ తన సంచలన కామెంట్స్ తో వార్తలకు ఎక్కుతున్నారు. హీరోయిన్స్ ని ఉద్దేశించి ఆయన మీడియా ముందు అభ్యంతర కామెంట్స్ చేశారు. జైలర్ మూవీలో తమన్నా ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ లో తమన్నా కాళ్ళ మధ్య చేతులు ఊపుతూ అలా డాన్స్ చేయడం అసభ్యంగా ఉందని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. తమన్నా దీనిపై స్పందించలేదు. అయితే త్రిషను బెడ్ రూమ్ కి తీసుకెళ్లాలి అనుకున్నా… అని మరో సందర్భంలో ఆయన చెప్పడం వివాదం రాజేసింది.
More
From Tollywood
లియా మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా మన్సూర్ అలీ ఖాన్ ప్రతి నాయకుడు పాత్ర చేశాడు. కాగా మీడియా సమావేశంలో… లియో మూవీలో త్రిష నటిస్తుందని నాకు తెలిసింది. ఆమెను నేను బెడ్ రూమ్ కి తీసుకెళ్లాలి అనుకున్నాను. రేప్ సీన్స్ ఉంటాయని భావించాను. కాశ్మీర్ లో జరిగిన లియో షెడ్యూల్స్ లో త్రిషను నాకు అసలు చూపించనేలేదు, అని మన్సూర్ అలీ ఖాన్ అన్నారు.
ఏ కామెంట్స్ ని త్రిష ఖండించింది. ఇకపై అతనితో నటించేది లేదని చెప్పింది. త్రిషకు క్షమాపణలు చెప్పాలని నడిగర్ సంఘం తాత్కాలిక నిషేధం విధించింది. మన్సూర్ అలీ ఖాన్ నేను తప్పు చేయలేదు. క్షమాపణ చెప్పేది లేదన్నారు. త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. వారిలో చిరంజీవి కూడా ఒకరు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి త్రిషకు మద్దతుగా మాట్లాడాడు. ఈ క్రమంలో మన్సూర్ అలీ ఖాన్ చిరంజీవిపై దారుణ ఆరోపణలు చేశారు.
చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఆయన ప్రతి ఏడాది తన ఓల్డ్ హీరోయిన్స్ ని పిలుచుకుని పార్టీలు చేసుకుంటాడు. డాన్సులు చేస్తాడు. నేను కూడా ఆయనతో నటించాను. నన్ను ఎప్పుడూ పార్టీకి పిలవలేదు. చిరంజీవి ఏదైనా మాట్లాడే ముందు నాకు ఫోన్ చేస్తే సరిపోయేది. అసలు ఏమైందని అడిగితే నేను చెప్పేవాడిని. విషయం తెలియకుండా నన్ను తప్పుబట్టారు, అని మన్సూర్ అలీ ఖాన్ ఓ వీడియో విడుదల చేశారు. అది వైరల్ అవుతుంది.