E-PAPER

జగన్ ను ఏకిపారేసిన ఓ యువతి..

తాజాగా ఓ ఎస్సి యువతి ఒకరు విడుదల చేసినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జగన్ పై నేరుగా సదరు యువతి విరుచుకు పడడం విశేషం. తన పేరు బొజ్జ ఐశ్వర్య అంటూ పరిచయం చేసుకుంటూ సాగిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ” రాజశేఖర్ రెడ్డి పై అభిమానంతో 2014లో వైసీపీకి ఓటు వేశా. 2019లో కాళ్ల చిప్పలు అరిగేలా ప్రచారం చేశారు. మా మద్దతుతో సీఎం అయ్యావ్. మా సొంత అన్నయ్య సీఎం అయ్యాడు అన్నంతగా ఆనందించాం. కానీ మా నమ్మకాన్ని వమ్ము చేశావంటూ ఆ యువతి చేసిన ఆరోపణలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

వ్యవస్థలను నాశనం చేసావ్. నీ వెనుక ఉన్న డప్పు బ్యాచ్ మాట వింటున్నావ్. బ్రిటిష్ పాలన తెచ్చావ్. ఎస్సీ, ఎస్టీ, బీసీల స్వయం ఉపాధి రుణాలు నిలిపివేశావ్. గత ప్రభుత్వం ఎస్సీలకు కార్లు ఇస్తే.. నీ పాలనలో అమ్మేసుకునేలా చేసావ్. 2024 ఎన్నికల్లో ఓటర్ అంటే ఏంటో చూపిస్తామంటూ ఆమె హెచ్చరికలు జారీ చేయడం విశేషం. బైబిల్ ఎంత బలమైందో నీకు తెలుసు కాబట్టి.. దేవుడే నీకు సమాధానం చెబుతాడు అంటూ గట్టి హెచ్చరికలు పంపడం హాట్ టాపిక్ గా మారింది. అయితే సదరు యువతి నిజమైన బాధితురాలా? లేకుంటే ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం.

 

Facebook
WhatsApp
Twitter
Telegram