తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల చెప్పారు. ‘నన్ను కట్టుకోబోయేవాడు అందంగా ఉండి కుటుంబానికి విలువ ఇవ్వాలి. అలాగే అతడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లో నన్ను భరించడం కొంచెం కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడితోనే నేను ఏడడుగులు వేస్తా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, శ్రీలీల నటించిన ‘ఆదికేశవ’ మూవీ రీసెంట్గా విడుదలైన విషయం తెలిసిందే.