రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35,356 పోలింగ్ కేంద్రాల్లో తెలంగాణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో వెబ్కాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,798 (78శాతం), 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల కోసం 67 మంది జనరల్ అబ్జర్వర్లను, 39 మంది పోలీస్ అబ్జర్వర్లను తెలంగాణ ఎన్నికల కోసం నియమించింది ఈసీ. నవంబర్ 30వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అయితే 13 సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించిన ఈసీ.. గంట ముందుగానే అంటే 4గం.కే పోలింగ్ ముగిసేలా ఏర్పాట్లు చేసింది.