గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ భారత మార్కెట్‌లో యూనిట్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. భారత్‌లో 200 కోట్ల డాలర్ల (రూ.16,600 కోట్లు) పెట్టుబడులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. అయితే తమ సంస్థ కార్యకలాపాల నిర్వహణకు రెండేళ్ల పాటు కార్లపై దిగుమతిపై సుంకం 15 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి షరతు విధించినట్లు సమాచారం.