భారత్‌లో గేమింగ్ పరిశ్రమ గత రెండేండ్లలో గణనీయంగా వృద్ధి చెందడంతో పలువురు యువకులు గేమింగ్ కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. భారత్ గేమింగ్ పరిస్ధితిపై ఇటీవల హెచ్‌పీ చేపట్టిన అధ్యయనంలో ఈ వృత్తిని సీరియస్‌గా తీసుకున్న వారిలో దాదాపు సగం మంది రూ.6లక్షల నుంచి రూ.12లక్షల వరకూ ఏటా ఆర్జిస్తున్నారని వెల్లడైంది. 3500 మంది ఈ సర్వే పలుకరించగా వీరిలో 75 శాతం మంది పురుషులు, 25 శాతం మంది స్త్రీలుగా ఉన్నారు.