గూగుల్ పేమెంట్స్ యాప్ గూగుల్‌పే యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. గూగుల్ పేలో ఇకపై మొబైల్ రీఛార్జ్ చేస్తే ఫీజు వసూలు చేయనుంది. కన్వీనియన్స్ ఫీజు రూపంలో స్వల్ప మొత్తంలో ఫీజు వసూలు చేయబోతోంది. అయితే ప్రస్తుతానికి కొందరు యూజర్ల నుంచి మాత్రమే ఈ తరహా వసూలు చేస్తుండగా భవిష్యత్‌లో అందరి నుంచీ ఈ ఫీజు వసూలు చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై గూగుల్ నుంచి అధికారిక సమాచారం లేదు.